ఆ వసంతం

ఆ వసంతం

చీకటి కాలంలో, అన్ని మేఘాలు కాంతికిరణాలను దాచేస్తే,
లోతైన చెమ్మ, అసంతృప్తి మిమ్మును అధిగమించినప్పుడు,
మీ చేసే ప్రయత్నాలు అన్నిటికీ అడ్డుగోడ తగిలినప్పుడు,
వెలుగునిచ్చే చంద్ర నక్షత్రాలు మీరు నుండి దాక్కుంటే,
మీ నావ ఎటువెళ్ళాలో మార్గం తేలిక నిలబడిపోతే,
మీ దేవుణ్ని జ్ఞాపకం చేసుకో, నీ తండ్రిని, నీ సృష్టికర్త, నీ ప్రభువు
ఇంకా నిన్ను వెదకుచున్నారని, నిన్ను ప్రేమిస్తున్నాడని,
అతను ని శిరస్సు మీదకి కాంతి తెచ్చి, నీ మనస్సుకు స్పష్టత,
నీ మనస్సుకు ప్రశాంతత, నీ బాధను ఆనందంగా
నీ ప్రార్ధన విని, నీ స్తుతులను, నీ కన్నీటిని చూసి
నీ శత్రువులు మందలించి, నీ అడ్డంకులను పడదోసి
పొంగుతున్న సముద ఉధృతిని తగ్గించి, నీ తెరచాపలో గాలి నింపి,
నువ్వు చూపే విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఆదరించి
నీకు ఇరుకుల్లో విశాలత కలుగచేసి
నీకు తన మార్గదర్శకత్వాన్ని ఇచ్చి
అతను మీ మార్గం సుగమనం అవ్వాలని దూతలను ఆదేశించి
ఎండిన ఎడారిలో మంచు కురిపించి, పాడైన చోట,
ఒక క్రొత్త సంతోషాన్ని కలిగిస్తాడు
అందుకే ఆయన వైపే చూడు
ఏకాంతంలో అయన కోసం కనిపెట్టు
క్రీస్తే ఆ వసంతం
యేసే నీలోని నూతన సృష్ఠి

Advertisements